రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో విద్యార్థినికి కాంస్య పతకం
MNCL: రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో తాండూరు మండలం ZPHS అచలాపూర్ విద్యార్థిని హర్షిత కాంస్య పతకం సాధించింది. ఈనెల 22 నుంచి 24వరకు హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో హర్షిత అత్యంత ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించిందని PET సామమూర్తి మంగళవారం తెలిపారు. ఈ మేరకు పాఠశాల HM ఉమాదేవి, అధ్యాపకులు విద్యార్థినిని అభినందించారు.