సంకల్ప సిద్ధి హనుమాన్‌కు సింధూరం పూజలు

సంకల్ప సిద్ధి హనుమాన్‌కు సింధూరం పూజలు

KMR: రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన సంకల్ప సిద్ధి హనుమాన్ స్వామికి శనివారం సింధూర పూజలు చేశారు. భక్తులు మంగళహారతులతో తీర్థప్రసాదాలు సమర్పించారు. సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు భరద్వాజ్ మహారాజ్ పాల్గొన్నారు.