విద్యార్థులకు మ్యాథమెటిక్స్ బోధించిన కలెక్టర్

ASF: జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్‌ను గురువారం కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాసేపు విద్యార్థులకు మ్యాథమెటిక్స్ బోధించారు. పలు ప్రశ్నలు వేసి విద్యాబోధన తీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఇచ్చిన సమాధానాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, నాణ్యమైన విద్య అందించాలని సూచించారు.