'సీఐటీయూ మహాసభలు జయప్రదం చేయాలి'
ప్రకాశం: 2025 DEC 31 నుంచి 2026 JAN 4 వరకు విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ 18వ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా నాయకులు మాలకొండయ్య కోరారు. శుక్రవారం వెలిగండ్ల మండల సీఐటీయూ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఐటీయూ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో జరగటం సంతోషదాయకమన్నారు. కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.