ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ శ్రీజ

ములుగు: తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ములుగు అదనపు కలెక్టర్ శ్రీజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఫార్మసీ గది, మందుల లభ్యత పట్ల డాక్టర్ రణధీర్‌ని అడిగి తెలుసుకున్నారు. ఇన్ పేషంట్ వార్డులో చికిత్స పొందుతున్న కొండపర్తి గ్రామానికి చెందిన ఇద్దరు గర్భిణీ స్త్రీలను కలిసి వారితో ఆసుపత్రిలో అందుతున్న సేవలు గురించి ఆరా తీశారు.