కృషి విజ్ఞాన కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

కృషి విజ్ఞాన కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

మెదక్: కౌడిపల్లి మండల పరిధిలోని తునికి గ్రామంలో గల కృషి విజ్ఞాన కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈనెల 25న ఉప రాష్ట్రపతి కృషి విజ్ఞాన కేంద్రానికి వస్తున్న సందర్భంగా కేంద్రాన్ని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వెల్లడించారు. వీరితోపాటు పోలీసులు, అధికారులు పాల్గొన్నారు.