తాళ్లవలసలో పంజా విసురుతున్న అతిసారం
శ్రీకాకుళం: సంత బొమ్మాలి మండలం తాళ్లవలసలో అతిసారం పంజా విసురుతుంది. కేవల రెండు రోజుల్లోనే 8 మందిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. చిన్నారావు అనే వ్యక్తి టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నేపథ్యంలోనే గ్రామంలో తాగునీటి నమూనాలు అధికారులు సేకరిస్తున్నారు. చేపలు, మాంసం విక్రయాలు నిలిపివేయాలని ప్రజలకు అధికారులు సూచించారు.