'రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి'
NLG: సూర్యాపేటలో ఈ నెల 28- 30 వరకు జరిగే తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పామనుగుళ్ళ అచ్చాలు విజ్ఞప్తి చేశారు. చిట్యాలలో ఇవాళ ఆ సంఘం మండల నాయకులతో కలిసి ఆయన మహాసభల గోడ పత్రికలు విడుదల చేశారు. 28న గీతన్నల పేరుతో రణభేరి బహిరంగ సభ జరుగుతుందన్నారు.