ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన తహశీల్దార్

MDK: చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు మడూరులో PACS ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహశీల్దార్ మన్నన్ పరిశీలించారు. సోమవారం ఉదయం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన కాంటాను పరిశీలించారు. కాంటా చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలన్నారు. ఎదైనా సమస్య ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.