క్రీడాకారిణిని అభినందించిన ఎమ్మెల్యే

క్రీడాకారిణిని అభినందించిన ఎమ్మెల్యే

కృష్ణా: కానూరు గ్రామ నివాసి కందెపి ప్రవీణ్ తనయుడు సుహాస్ కందెపి(13) జాతీయస్థాయి బాడ్మింటన్ పోటీల్లో కాంస్య పతకం సాధించడం అభినందనీయమని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. JBS బాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొంది, అండర్–13 విభాగంలో యునక్స్ సన్‌రైస్ 37వ సబ్ జూనియర్ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2025లో పాల్గొని, కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.