ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

SKLM: ఆమదాలవలస పట్టణంలో గురువారం సాయంత్రం పలు ఎరువుల దుకాణాలలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎరువులు అధిక ధరలకు విక్రయించిన, నాణ్యతలో లోపాలు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఆమదాలవలస రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ నుంచి డంపింగ్ చేస్తున్న ఎరువులు పరిశీలించారు. ఆయన వెంట ఏవో మెట్ట మోహన్ రావు ఉన్నారు.