అలర్ట్.. నేడు జిల్లాకు భారీ వర్ష సూచన

అలర్ట్.. నేడు జిల్లాకు భారీ వర్ష సూచన

ఉపరితలఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇవాళ కోనసీమ జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా పొలాల వద్దకు వెళ్లే రైతులు పిడుగులు పడే అవకాశం ఉండటంతో చెట్ల కింద ఉండరాదని హెచ్చరించింది. మత్స్యకారులు కూడా ఈ సూచనలు పాటించాలని పేర్కొంది.