'సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
కడప: సీజనల్ వ్యాధులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాధవరం PHC వైద్యాధికారి డాక్టర్ శివకుమార్ అన్నారు. సిద్దవటం మండలం మాధవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. కురుస్తున్న వర్షాల కారణంగా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని తీసుకోవాలన్నారు. రాత్రి వేళలో దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని సూచించారు.