బొబ్బిలి గ్రామీణ సీఐగా శ్రీనివాస్
విజయనగరం: బొబ్బిలి గ్రామీణ సీఐగా ఎస్.శ్రీనివాస్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడిరాక ముందు విజయనగరం డీ.ఎస్.బీ.లో సీఐగా పనిచేస్తూ బొబ్బిలి గ్రామీణ సీఐగా బదిలీపై వచ్చారు. గతంలో రామభద్రపురం, తెర్లాం పోలీసు స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పటివరకు అదే స్థానంలో విధులు నిర్వహించిన కే.నారాయణరావు బొబ్బిలి టౌన్ సీఐగా బదిలీ అయ్యారు.