పేరుపాలెం బీచ్‌లో పర్యాటకులు సందడి

W.G: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో ఆదివారం పర్యాటకులతో సందడిగా మారింది. సెలవూదినం కావడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి అధిక సంఖ్యలో కుటుంబ సమేతంగా బీచ్‌కు వచ్చి పర్యాటకులు సముద్ర స్నానాలు ఆచరించి, పక్కనే ఉన్న దేవాలయాలు దర్శించుకున్నారు. అనంతరం పిల్లలు ఇసుకతో బొమ్మరిల్లు కట్టుకుంటూ, ఉల్లాసంగా గడిపారు.