సీసీ రోడ్డు పనులను తనిఖీ చేసిన కలెక్టర్
వనపర్తి మండలం పెద్దగూడెం డబుల్ బెడ్ రూమ్ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను కలెక్టర్ ఆదర్శ్ సురభి తనిఖీ చేశారు. కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ఇళ్లలో అసలైన లబ్ధిదారులే ఉంటున్నారా? లేదా? అన్నది విచారించాలని తహశీల్దార్‌కు సూచించారు.