గంజాయి నిర్మూలనకు పక్కా ప్రణాళికలు

గంజాయి నిర్మూలనకు పక్కా ప్రణాళికలు

ASR: జిల్లాలో గంజాయి రవాణా నిర్మూలనకు పక్కా ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి గంజాయి రవాణా చేయడం చాలా కష్టం అనే పరిస్థితిని తీసుకురావాలన్నారు. గంజాయిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.