మాజీ ప్రధానికి నివాళులు అర్పించిన బీజేపీ ఎస్సీమోర్చా అధ్యక్షుడు

WGL: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ అటల్ బిహారి వాజ్‌పేయ్ శత జయంతి సందర్బంగా బుధవారం వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్‌కి పండ్లు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా పట్టణ అధ్యక్షులు పెద్దురి రాజు, తదితరులు పాల్గొన్నారు.