పసి పాప ప్రాణం తీసిన పాము
WGL: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని పాము కాటు వేయడంతో మృతి చెందిన విషాదకర ఘటన నెక్కొండ మండలంలో చోటుచేసుకుంది. వాగ్యా నాయక్ తండాలోని కుట్టి ఇంటి ముందు ఆడుకుంటూ బాత్ రూం వద్దకు వెళ్లగా పాము కాటు వేసింది. విషయం తెలియని తల్లిదండ్రులు పాప ఏడుస్తుంటే బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా పాప నోటి నుండి నురగలు రాగా ఆసుపత్రికి తరలిస్తుండగా పాప మార్గ మధ్యలో మృతి చెందింది.