'రామాయణ' టీజర్ వచ్చేసింది
ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రామాయణ' టీజర్ విడుదలైంది. ఇందులో శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అద్భుతమైన విజువల్స్, గ్రాండ్ సెట్టింగ్స్‌తో కూడిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ చిత్రం జనాలను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.