VIDEO: ముద్దనూరులో పోలీసుల చలివేంద్రం ప్రారంభం
కడప జిల్లా ముద్దనూరులో వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని సీ.ఐ నగేష్ బాబు ప్రారంభించారు. బాటసారులు, ఆటో డ్రైవర్లు, ప్రజలకు చల్లటి తాగునీరు అందించడంతో పాటు మహిళా భద్రత, ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించే పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని డీఎస్పీ కే. వెంకటేశ్వరరావు అభినందించారు.