డబ్బులు రాకపోవడంతో.. ఉరేసుకుని ఓ వ్యక్తి మృతి
కోనసీమ: రామచంద్రపురం మండలం ఉండూరు గ్రామానికి చెందిన ఎం. లెనిన్ (34) గొల్లపాలెం గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటూ మద్యానికి బానిసై, పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు రాకపోవడంతో ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.