సర్పంచ్ ఎన్నికలు.. వీరు అనర్హులు
TG: అంగన్‌వాడీ టీచర్లు, మతిస్థిమితం లేనివారు అనర్హులు. ఒక వ్యక్తి గరిష్ఠంగా 4 నామినేషన్లు వేయొచ్చు. వార్డుకు పోటీ చేసే వ్యక్తి SC, ST, BCల నామినేషన్ల రుసుము రూ.250, రూ.500 చెల్లించాలి. సర్పంచ్ అభ్యర్థులైతే SC, ST, BCల నామినేషన్ రూ.1000, ఇతరులకు రూ.2,000 చెల్లించాలి. ఒక వ్యక్తి క్రిమినల్ కోర్టు ద్వారా దోషిగా నిర్ధారణయితే 5 ఏళ్ల వరకు పోటీ చేయడానికి అనర్హుడు.