కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
SKLM: రణస్థలం మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి కూరగాయల మార్కెట్‌ను ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు ప్రారంభించారు. గురువారం ఉదయం కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ మార్కెట్‌ను ఎంపీడీవో ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే కూరగాయల వ్యాపారులు కూడా వినియోగదారులకు సహకరించాలన్నారు.