రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి

VZM: బొండపల్లి మండలం బిల్లలవలస జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై ఛత్తీస్‌గడ్, ఒడిస్సాకి చెందిన రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఒక లారీ డ్రైవర్ స్పాట్‌లో చనిపోగా, ఇంకొక లారీ డ్రైవర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.