రూ. 100కోట్ల స్థలం.. హైకోర్టు నోటీసులు

TG: జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద ఉన్నరూ.100కోట్ల విలువైన స్థలానికి సంబంధించి హైడ్రా, జీహెచ్ఎంసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చెక్ పోస్టు సమీపంలో ఉన్న 2వేల గజాలకు పైగా స్థలాన్ని ఇటీవల హైడ్రా స్వాధీనం చేసుకుంది. అయితే ఈ స్థలం తనదని.. హైడ్రా అన్యాయంగా స్వాధీనం చేసుకుందని సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు నోటీసులు ఇచ్చింది.