'మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి'
BDK: గుండాల కాచనపల్లి గ్రామంలో ప్రాథమిక సహకార పరపతి సంఘం ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని AIKMS ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సీతారాములు మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా 40% రైతులు యాసంగి మొక్కజొన్నలు పండిస్తున్నారని, రైతులకు అందుబాటులో ఉండేలా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.