అలుగు పారుతున్న అన్నాసాగర్ చెరువు

SRD: భారీ వర్షాలకు ఆందోలు మండలం అన్నాసాగర్ చెరువు ఆదివారం అలుగు పారింది. చెరువు అలుగు పారడంతో చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. చెరువు సమీపంలోని పంట పొలాల రైతులు సంతోషం వ్యక్తం చేశారు. చెరువు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ఇటువైపు ప్రజలు రావద్దని సీఐ అనిల్ కుమార్ చెరువు వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.