భూపాలపల్లి పురపాలక సంఘం వార్షిక బడ్జెట్ రూ.27.97 కోట్లు

భూపాలపల్లి పురపాలక సంఘం వార్షిక బడ్జెట్(2024-25) రూపకల్పన చేసి గురువారం కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టారు. రూ.27.97 కోట్లతో కూడిన బడ్జెట్‌ను మున్సిపల్ ఛైర్‌పర్సన్ సెగ్గం వెంకటరాణితో పాటు కౌన్సిలర్లంతా ఆమోదం తెలిపారు. సమావేశానికి ఛైర్మన్‌తో పాటు 11మంది వార్డు కౌన్సిలర్లు హాజరయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి పద్దును రూ.1.41 కోట్లు ఎక్కువగా చూపారు.