14 లీటర్ల మద్యం, 23 బైకులు సీజ్
SRCL: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో మంగళవారం సిక్వాడలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. నాట్కోటిక్ డాగ్స్ తనిఖీలు చేపట్టి పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలు, 14 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులపై వెంటనే సమాచారం ఇవ్వాలని, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.