VIDEO: కనువిందు చేసిన జాతీయ పక్షి
HYD: కేబీఆర్ నేషనల్ పార్క్ నుంచి ఒక నెమలి జనారణ్యంలోకి వచ్చి ఇవాళ అందరినీ ఆశ్చర్యపరిచింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద నెమలి ఎంతో క్రమశిక్షణతో ఫుట్ పాత్ మీద నడుస్తూ ఆకట్టుకున్నట్లు స్థానికులు తెలిపారు. వాహనాల రద్దీ ఉన్నప్పటికీ.. పకృతికి, నగర జీవనానికి మధ్య ఉన్న విడదీయలేని బంధానికి ఈ దృశ్యం నిదర్శనంగా నిలిచింది.