కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

SRCL: ముస్తాబాద్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో అందిస్తున్న ఆనకాడమీ ఆన్‌లైన్ కోచింగ్ తరగతుల వివరాలు పరిశీలించారు. 8, 9,10 విద్యార్థులకు సైన్స్, మ్యాత్స్ పాఠాలను బోధించారు. పలు ప్రశ్నలు అడిగి విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు. పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.