ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే దంపతుల పూజలు
PDPL: రామగుండం B-పవర్ హౌస్ గుట్టపైన వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఇవాళ ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి వారికి ఆశీస్సులు అందజేసి, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం గుట్టపై నిర్మిస్తున్న ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. ఆయన వెంట స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు.