మంత్రి క్యాంప్ ఆఫీస్ ముందు అంగన్వాడీల ధర్నా

NLG: అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలు మానుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. ప్రీ ప్రైమరీ తరగతులను అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగించాలని అన్నారు. నల్గొండ, గడియారం సెంటర్లో గల మంత్రి క్యాంప్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్లు సోమవారం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేతలు పాల్గొన్నారు.