'ప్యారడైజ్' సింగిల్ సెట్ కోసం భారీ ఖర్చు!
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో 'ప్యారడైజ్' మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే మేకర్స్.. ఓ సింగిల్ సెట్ కోసం రూ.7 కోట్లకుపైగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. HYDలోని ఓ ప్యాలెస్ లాంటి సెట్ వేయడానికి ఆ మొత్తాన్ని కేటాయిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం 2026 మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.