ఎమ్మిగనూరులో ఉచిత వైద్య శిబిరం
KRNL: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఎమ్మిగనూరు లక్ష్మీపేట, సంజీవ్ నగర్ కాలనీల్లో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సెయింట్ జాన్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీ. సుధాకర్ ఆధ్వర్యంలో, డాక్టర్ శారద నేతృత్వంలో వైద్యులు సేవలు అందించారు. మాజీ కౌన్సిలర్ రామకృష్ణ నాయుడు సహకారంతో రోగులకు ఉచిత మందులు పంపిణీ చేశారు.