సెప్టెంబర్ 1న రెడ్ క్రాస్ సమావేశం

కర్నూలు జిల్లా రెడ్ క్రాస్ సాధారణ సమావేశం సెప్టెంబర్ 1న జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకోవడానికి రెడ్ క్రాస్ ప్యాట్రన్లు, వైస్ ప్యాట్రాన్లు, జీవితకాల సభ్యులు, అసోసియేట్ సభ్యులు పాల్గొనాలని డీఆర్వో సి. వెంకట నారాయణమ్మ శనివారం తెలిపారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు జరగనుంది.