అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

W.G: ఉండి మండలం ఉణుదుర్రు గ్రామంలో నిర్మించిన వాటర్ స్కీం, ఆయుష్మాన్ హెల్త్ క్లినిక్, కమ్యూనిటీ హాల్ & సీసీ రోడ్లను మంగళవారం శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ప్రారంభించారు. గ్రామంలో సుమారు కోటి రూపాయల వ్యయంతో ఈ అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.