కేసీఆర్ క్రికెట్ కప్–2026 ఘన ప్రారంభం
హనుమకొండలో కాకతీయ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “కేసీఆర్ క్రికెట్ కప్–2026” 8వ సీజన్ గురువారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఘనంగా ప్రారంభమైంది. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ జెండా ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు.