విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన

VZM : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు గురువారం గజపతినగరంలోని నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జిల్లా అధ్యక్షులు డి. రాము మాట్లాడుతూ.. డిగ్రీ విద్యార్థులకు ఉపకార వేతనాలు బకాయిలు ఉండడంతో ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులు కట్టుకోలేకపోతున్నామని చెప్పారు.