నేడు వరదయ్యపాలెంలో ఎమ్మెల్యే పర్యటన

నేడు వరదయ్యపాలెంలో ఎమ్మెల్యే పర్యటన

TPT: వరదయ్యపాలెం మండలంలో సోమవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు ముస్లీంపాలెంలో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనానికి భూమిపూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.