పోలీసుల వేధింపులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

NZB: నగరంలో గంజాయి కేసుల్లో నిందితుడిగా ఉన్న అప్రోజ్ అనే యువకుడు, ఇటీవల జైలు నుంచి విడుదలైన తర్వాత పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, స్థానిక పోలీస్ స్టేషన్‌ల అధికారులు అతనిపై గంజాయి కేసులు నమోదు చేస్తామని బెదిరించడంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.