VIDEO: వరంగల్ నగరం మత సామరస్యానికి ప్రతీక: MLA నాయిని
HNK: కాజీపేటలో ఫాతిమా ఫీస్ట్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ... వరంగల్ నగరం అనేది ఎప్పటి నుంచో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల ప్రజలు పరస్పర గౌరవంతో, ఐక్యతతో జీవించడం వరంగల్ ప్రత్యేకత అని, భక్తులందరికీ ఫాతిమా మాత ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.