ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి: కలెక్టర్
VKB: కుల్కచర్ల మండలంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ దీపక్ తివారి సోమవారం పరిశీలించారు. పనుల పురోగతిపై లబ్ధిదారులతో మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం పేదలందరికీ గృహాలు అందించేందుకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.