జిల్లా అదనపు ఎస్పీగా చేతన్ నితిన్ జాయిన్
JGL: జిల్లా అదనపు ఎస్పీగా చేతన్ నితిన్ గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. చేతన్ నితిన్ 2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గతంలో జనగామలో ఏఎస్పీగా విధులు నిర్వర్తించారు. బాధ్యతలు చేపట్టడంతో అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.