'పాడి పశువులకు ఇంజక్షన్ తప్పనిసరి'
VZM: చీపురుపల్లి పుర్రేయవలస గ్రామంలో ఆంధ్రప్రదేశ్ పశుగణాబివృద్ధి సంస్థ, పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో కృత్రిమ గర్భదారణ ద్వారా పుట్టిన ఆడ దూడల ప్రదర్శన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి పాడి పశువుకు తప్పనిసరిగా ట్రిపుల్ ఎస్ ఇంజక్షన్ రైతులు చేయించాలని ఆ శాఖ విజయనగరం డివిజన్ ఉపసంచాలకులు దామోదర రావు తెలిపారు. ఈమేరకు 50 మంది రైతులు తమ దూడలను ప్రదర్శించారు.