రేషన్ షాపుల్లో కందిపప్పు కరువు.. కార్డుదారుల ఆవేదన
నెల్లూరు జిల్లా పొదలకూరు, కోవూరులోని గల రేషన్ దుకాణాల్లో గత 10 నెలలుగా కందిపప్పు సరఫరా నిలిచిపోవడంతో కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ. 120-140 ఉండటంతో పేదలు కొనలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి వచ్చే సంక్రాంతి పండుగకైనా కందిపప్పు సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.