నేటి నుంచి ఆర్టీసీ నైట్ సర్వీసులు రద్దు
ASR: మావోయిస్టుల పీఎల్ జీఏ వారోత్సవాల నేపథ్యంలో మంగళవారం నుంచి ఈనెల 8వరకు విశాఖపట్నం డిపో నుంచి సీలేరు మీదుగా నడిచే ఆర్టీసీ నైట్ సర్వీసు బస్సులను రద్దు చేసినట్టు విశాఖ డిపో డీఎం మాధురి తెలిపారు. విశాఖ-సీలేరు నైట్ హాల్ట్, విశాఖ-భద్రాచలం, అలాగే భద్రాచలం-విశాఖ నైట్ సర్వీసులను రద్దు చేశామన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.