VIDEO: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్
WNP: 'ప్రజావాణి' కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు అర్జీలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్‌తో కలిసి ప్రజల నుంచి అర్జీలు వినతులు స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.