కుటుంబానికి అండగా ఉండే వ్యక్తి కోల్పోవడం బాధాకరం: మంత్రి
MLG: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మరణంపై మంత్రి సీతక్క తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తి కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం పూర్తి సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఆర్టీసీ సిబ్బంది ఆవేశానికి లోనవకుండా శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోసం చర్చల ద్వారా మార్గం కనుగొంటామని తెలిపారు.